Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 02:54AM

17న విశాఖలో టూరిజంపై సమీక్ష హాజరుకానున్న చందనాఖాన్‌

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో టూరిజం ప్రాజెక్టులపై ఉన్నతాధికారులు ఈ నెల 17న విశాఖపట్నంలోని రుషికొండ వద్ద వున్న ఏపీటీడీసీ రిసార్ట్స్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్‌, ఇతర అధికారులు దీనికి హాజరు కానున్నారు. విశాఖను మెగా టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో దాదాపు రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న టూరిజం ప్రాజెక్టులకు ఇటీవల టెండర్లు ఆహ్వానించగా, పలు సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. ఈ సంస్థలతో చర్చించి వారి నుంచి డీపీఆర్‌ చేపట్టాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.