Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 4 2016 @ 00:55AM

సంక్షేమ శాఖకు అధిక నిధులు

  • కేంద్రమంత్రికి రావెల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
 
నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట), జనవరి 3: దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా ఏపీలో సాంఘిక సంక్షేమ శాఖకు అధిక నిధులు కేటాయిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. నెల్లూరులో ఆదివారం తమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై కేంద్రమంత్రి థవార్‌చంద్‌ గేహ్లాట్‌కు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కోసం ప్రత్యేక యాక్ట్‌ రూపొందించి వేల కోట్లు నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభు త్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వీడియోను చూపించారు. కాగా, ఈ పథకాలు, కార్యక్రమాల ప్రాజెక్టు రిపోర్టులను ఇవ్వాలని కేంద్రమంత్రి గేహ్లాట్‌ కోరారు.