Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 4 2016 @ 00:36AM

ఐఎస్‌తో ఇస్లాంకు సంబంధంలేదు: అసదుద్దీన్‌

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, జనవరి 3: ఐఎస్‌ ఉగ్రవాద సంస్థతో ఇస్లాం కు ఎటువంటి సంబం ధంలేదని, ముస్లిం యువకులు దాని ఉచ్చులో పడకూడదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. పవిత్ర ఇస్లాంను నమ్మి, తీవ్రవాదానికి యువకులు దూరంగా ఉండాలని సూచించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో జమాతే ఇస్లాం ఆధ్వర్యంలో నిర్వహించిన మహమ్మద్‌ ప్రవక్త ధార్మిక సదస్సులో మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఆరెస్సెస్‌, దాని అనుబంధ సంస్థలు పరోక్షంగా అధికారం చెలాయిస్తూ ముస్లింలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కంప్యూటర్ల ముందు కూర్చుంటే ఇస్లాం గురించి తెలియదని, పవిత్ర మతగురువుల వద్దకెళ్తే దాని పవిత్రత తెలుస్తుందని ఒవైసీ చెప్పారు. బీఫ్‌ తినాలంటే పాకిస్థాన్‌కు వెళ్లాలంటూ బీజేపీ, దాని అనుబంధ సంఘాలు మాట్లాడుతున్నాయని, మరి ప్రధాని నరేంద్రమోదీ ఎవరికీ చెప్పకుండా పాకిస్థాన్‌కు ఎందుకెళ్లారని, నవాజ్‌ షరీఫ్‌ను ఎందుకు కౌగిలించుకున్నారని ఒవైసీ ప్రశ్నించారు. జాతీయ గీతం పాడుతుంటే కూర్చున్నవారు గౌరవంగా లేచి నిలబతారని, అలాంటిది రష్యా పర్యట నకు వెళ్లినప్పుడు మోదీ నడుచుకుంటూ వెళ్లి జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపిం చారు. మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమలేష్‌ తివారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రవక్తను అవమానించిన వారి చావు ఘోరంగా ఉంటుందన్నారు.