Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 3 2016 @ 22:21PM

ఇండస్‌ ఇండ్‌ ఫేస్‌ టు ఫేస్‌ బ్యాంకింగ్‌

దేశీయ బ్యాంకింగ్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ వినియోగంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు పోటీ పడుతున్నాయి. కస్టమర్లకు వినూత్న సేవలను అందిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రైవేటు రంగంలోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఫేస్‌ టు ఫేస్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ‘వీడియో బ్రాంచ్‌’ పేరుతో అందుబాటులో ఉంచిన అప్లికేషన్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సదుపాయాన్ని బ్యాంకు ఖాతాదారులందరూ వినియోగించుకోవచ్చు. వీడియో బ్రాంచ్‌ యాప్‌ ద్వారా ఖాతా ఉన్న శాఖ మేనేజర్‌, రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌ లేదా సెంట్రలైజ్డ్‌ వీడియో బ్రాంచ్‌ ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా మాట్లాడవచ్చు. వివిధ రకాల సమాచారాన్ని పొందడానికే కాకుండా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఫోన్‌ బ్యాంకింగ్‌లో అందిస్తున్న సదుపాయాలన్నీ వీడియో బ్రాంచ్‌ ద్వారా పొందవచ్చని బ్యాంకు చెబుతోంది. ఈ సేవ ద్వారా బ్యాంకు కస్టమర్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదా రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాను తెరవొచ్చు. నెఫ్ట్‌, ఆర్‌టిజిఎస్‌ ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ కూడా చేయవచ్చు. మరిన్ని సేవలను కూడా దీని ద్వారా పొందవచ్చు. ఎన్‌ఆర్‌ఐలు కూడా వీడియో బ్రాంచ్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు.
 
ఇండస్‌ఇండ్‌ బ్యాంకు తన కొత్త కస్టమర్లు నచ్చిన నెంబర్‌ను తన ఖాతా నెంబర్‌గా ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. సాధారణంగా బ్యాంకులు డీఫాల్ట్‌గా జనరేట్‌ అయ్యే ఖాతా నంబర్‌ను కస్టమర్లకు అందిస్తుంటాయి. నచ్చిన నెంబర్‌ను పొందే అవకాశం ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు కస్టమర్లు నచ్చిన నెంబర్‌ను ఎంచుకునే సౌలభ్యాన్ని కల్పిస్తూ కొత్త కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని రానున్న కాలంలో అనుసరించే అవకాశం ఉండవచ్చని బ్యాంకింగ్‌ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.