Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 3 2016 @ 16:07PM

రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర మంత్రి గడ్కరీ

హైదరాబాద్: రేపు రాష్ట్రంలో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వరంగల్‌ జిల్లాలో గోదావరిపై వంతెనను ప్రారంభిస్తారని తుమ్మల తెలిపారు. అంతే కాకుండా వరంగల్‌ నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి గడ్కరీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. తెలంగాణలో 1850 కి.మీ మేర రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని గడ్కరీని కోరుతామని తుమ్మల వెల్లడించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల క్యాంప్‌ ఆఫీస్‌ల నిర్మాణం కోసం ఈ నెలలోనే టెండర్లు పిలుస్తామని తుమ్మల తెలిపారు.