desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 2 2016 @ 19:07PM

జన్మభూమిని అడ్డుకుంటే పుట్టగతులుండవు: పుల్లారావు

గుటూరు: క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పవిత్ర కార్యక్రమం జన్మభూమి-మాఊరు సభలను వైసీపీ శ్రేణులు అడ్డుకోవాలని జగన్‌ పిలుపునివ్వడం సిగ్గు చేటని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేట పట్టణంలోని 15వవార్డులో శనివారం  జన్మభూమి-మాఊరులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జగన్‌ పార్టీ ఎక్కడికక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. అడ్డుకుంటే మీడియాలో వస్తుంది కాని ప్రజాసమస్యలు పరిష్కారం కావన్నారు. రాష్ట్రాన్ని దోపిడి చేసి లూటీలకు పాల్పడిన జగన్‌కు మాట్లాడే అర్హత కూడాలేదని పుల్లారావు అన్నారు.