Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 02:49AM

యాదగిరీశుడికి రైతు దంపతుల 11 ఎకరాల భూ విరాళం


యాదగిరిగుట్ట, సెప్టెంబర్‌ 14: భక్తుల కొంగు బంగారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి భువనగిరి మండలం గౌస్‌నగర్‌కు చెందిన భేతాళ భిక్షపతి, బాలమ్మ అనే దంపతులు 11 ఎకరాల భూమిని సమర్పించారు. గ్రామంలోని సర్వే నెంబర్‌ 96, 97లలో గల 11ఎకరాల 27 గుంటల తమ వ్యవసాయ భూమిని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రాసిచ్చినట్లు ఆ రైతు దంపతులు తెలిపారు. ఈ మేరకు ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎంఎండీ కృష్ణవేణికి ఆదివారం భూ దానపత్రాన్ని అందజేశారు. దాతల నుంచి ప్రాథమికంగా తీసుకున్న పత్రాన్ని రెవెన్యూ అధికారులతో పరిశీలన చేసిన తర్వాత, భూమి స్వాధీనానికి చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు వివరించారు.