Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 2 2016 @ 04:28AM

గాడిదతో గాడిదలా ప్రవర్తించి జైలుపాలయ్యాడు

న్యూయార్క్‌: కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి ముసలి, పడుచే కాదు.. మనిషికి, జంతువుకీ కూడా తేడా తెలీదు. అమెరికాలోని టెన్నసీ నగరానికి చెందిన ఓ వ్యక్తి.. ఓ ఆడ గాడిదతో శృంగారం చేసి జైలు కెళ్లాడు.
 
టెన్నసీకి చెందిన స్వార్జెన్‌ట్రుబర్‌ (21) గత నెలలో ఒంటరిగా తన ఇంట్లో ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఆ సమయంలో అతనిలో కామ వాంఛలు మిన్నంటాయి. దీంతో అతని దృష్టి తన పక్కింటి వ్యక్తి యొక్క ఆడ గాడిద మీద పడింది. కోరిక తీర్చుకోవడానికి ఏదైతే ఏమిటని భావించి ఆ గాడిదతో సెక్స్‌ చేశాడు. మిట్ట మధ్యాహ్నం తన గాడిద ఎందుకు ఇంతలా అరుస్తోందని బయటకు వచ్చి చూశాడు దాని యజమాని. అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతణ్ని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. దీనిపై సమగ్రంగా విచారించిన కోర్టు అతనికి 443 డాలర్లు (దాదాపు 30 వేల రూపాయలు) జరిమానా విధించింది. అలాగే అతణ్ని తొమ్మిది నెలల పాటు జైళ్లో పెట్టి కౌన్సిలింగ్‌ ఇప్పించాలని పోలీసులకు సూచించింది.