Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 2 2016 @ 02:15AM

ఎర్రవల్లిలో వేగంగా డబుల్‌ బెడ్‌రూం పనులు

కొత్త ఏడాది మొదటి రోజున తొలి శ్లాబు 
జగదేవ్‌పూర్‌: మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఊళ్లో 300డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి దసరా పండుగ నాడు శ్రీకారం చుట్టారు. వారం రోజులుగా పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి. కాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుక్రవారం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక ఇంటి నిర్మాణానికి శ్లాబు వేశారు. ఎంఎ్‌ఫఎస్‌ విధానం ద్వారా ఈ శ్లాబు వేశారు. త్వరలోనే ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మీనాక్షి కన్‌స్ట్రక్షన్‌ నిర్వాహకులు తెలిపారు.