Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 2 2016 @ 02:14AM

బాలుడి అభిలాష నెరవేర్చిన కేటీఆర్‌

  • నిమ్స్‌కు వెళ్లి పరామర్శించిన మంత్రి 
పంజాగుట్ట/హైదరాబాద్‌: తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన సంతోష్‌ అనే బాలుడిని మంత్రి కేటీఆర్‌ శుక్రవారం పరామర్శించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామానికి చెందిన కృష్ణార్జున్‌రావు, జ్యోతి దంపతుల కుమారుడు సంతోష్‌.. చిన్నప్పటి నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు. 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి 9.5 పర్సంటేజీ తెచ్చుకున్నాడు. అయితే నొప్పి తీవ్రం కావడంతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో సంతోష్‌కు వైద్య పరీక్షలు చేయించారు. కడుపులో చిన్న, పెద్ద పేగులు మెలికలు పడడంతోపాటు దెబ్బతిన్నాయని, ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యుల అనుమతితో శస్త్రచికిత్స చేసి పేగులను కొంతమేర తొలగించారు. తర్వాత సంతోష్‌ను నిమ్స్‌కు తరలించారు. కొద్ది రోజులుగా నిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నాడు. తనకు ఉన్నత చదువులు చదివి పేదలకు సేవ చేయాలని ఉందని, మంత్రి కేటీఆర్‌ను కలుసుకొని మాట్లాడాలని ఉందని సంతోష్‌ తల్లిదండ్రులకు చెప్పా డు. వాళ్లు ఈ విషయాన్ని మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ దృష్టికి తీసుకెళ్లగా సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌కు ఈ విషయం చెప్పారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన నిమ్స్‌కు వెళ్లి సంతోష్‌తో మాట్లాడారు. సంతోష్‌కు ధైర్యం చెప్పడంతోపాటు చదువు కూడా చెప్పిస్తానని హామీ ఇచ్చారు.