Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 2 2016 @ 01:08AM

గ్రేటర్‌ ఎన్నికల్లో ముస్లింలు, సెటిలర్లకు అవకాశం: ఉత్తమ్‌

  • స్థానిక బలాబలాలను బట్టి అన్ని వర్గాలకూ న్యాయం 
  • 7 నుంచి గ్రేటర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తాం 
  • ముస్లిం కోటాపై టీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యాన్ని 
  • మజ్లిస్‌ ఎందుకు నిలదీయట్లేదు?
హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల్లో ముస్లింలు, సెటిలర్లకు సీట్లు కేటాయించి తగు అవకాశం ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. స్థానిక బలాబలాలు, పరిస్థితులను బట్టి సీట్లు కేటాయించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పూర్తి సమాయత్తంగా ఉందన్నారు. ఈ నెల 3వ తేదీన గ్రేటర్‌ పరిధిలోని అన్ని డివిజన కమిటీలతో గాంధీభవన్‌లో సమావేశమవుతామని, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సెల్‌ను ఏర్పాటు చేసి 4వ తేదీ నుంచి ఆశావహుల దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో డివిజన కమిటీ, బూత కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ఇన్‌చార్జిలతో భేటీ అవుతామని ఆయన తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి అన్ని డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామన్నారు. కాగా, ఎంఐఎంపై ఆయన మండిపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన కోటా పెంచుతామని హామీ ఇచ్చి.. దానిని నిర్లక్ష్యం చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మజ్లిస్‌ ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. ముస్లింల ఓట్ల కోసం ఆ వర్గాన్ని మభ్యపెట్టడం మినహా వారి బాగు కోసం మజ్లిస్‌ చేసిందేమీ లేదన్నారు. అధికార పార్టీతో కుమ్మక్కై ప్రజలకు న్యాయంగా రావాల్సిన హక్కులను సాధించడంలో కూడా ఆ పార్టీ విఫలమవుతోందని ఆయన ఆరోపించారు.