Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 2 2016 @ 01:03AM

అభివృద్ధిని ఓర్వలేకే చిల్లర విమర్శలు: కొప్పుల ఈశ్వర్‌

హైదరాబాద్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని, ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు చిల్లరమల్లర విమర్శలు చేస్తున్నాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నాయకులు కళ్లుండీ చూడలేని కబోదుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ హామీలేవీ అమలు కావడం లేదని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీ చేసిన విమర్శలపై ఈశ్వర్‌ ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ హామీని అమలు చేయడంలేదో కాంగ్రెస్‌ నాయకులు చెప్పాలన్నారు.