Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 2 2016 @ 00:36AM

చిట్టీల పేరుతో మోసం చేసిన 15 మంది అరెస్టు

నెక్కొండ (వరంగల్‌) : వారం వారం చిట్టీల పేరుతో రూ.25 లక్షలు వసూలు ఉడాయించిన 15 మందిని వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం గూడూరు పోలీసులు అరెస్టు చేశారు. రెండు సంవత్సరాల క్రితం వీరు నెక్కొండలో పావని ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఏడు మండలాల్లోని 33 గ్రామాల్లో 1448 మంది సభ్యుల నుంచి ( 18 వారాలు) రూ.25,45,740 వసూలు చేశారు. వారం వారం డ్రా తీస్తూ చిన్న చిన్న బహుమతులను అందిస్తూ ప్రజలను నమ్మించి కొంత కాలానికి గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు. దీంతో 8 సెప్టెంబర్‌ 2015న కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మడిపెల్లి సామ్రాజ్యంతో పాటు మరికొందరు నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శుక్రవారం నెక్కొండలోని నెహ్రూ సెంటర్‌లో వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 12.67 లక్షలను రికవరీ చేశారు. ఈ కేసులో చేర్యాల మండలం తాడూరు గ్రామానికి చెందిన మిద్దబోయిన రవి, పూసల రవి, గుంటిపల్లి నరేష్‌, కావటి బారతమ్మ, మేడబోయిన కళవతి, కావటి బాలమన్ని, కావటి సంతోష్‌, మేడబోయిన వేణు, పెద్దకళవతి, రాజేశ్వరీ, శ్రీను, మధు, నాగరాజు, మహమ్మద్‌ హైమత్‌, పూసల రాజు లను అరెస్టుచేసి నర్సంపేట కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.