Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 18:37PM

ఇద్దరు మంత్రుల మధ్య పిడిగుద్దులు

విశాఖ : ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాల అయ్యన్నపాత్రుడు ఒకే పార్టీకి చెందిన వారైనా...వారికి ఒకరంటే ఒకరికి పడదని తెలిసిందే. ఉప్పు...నిప్పులా ఉంటూ జిల్లాలో ఆధిపత్యం కోసం పోట్లాడుకునే ఆ ఇద్దరూ శుక్రవారం సాగర తీరంలో కాసేపు సందడి చేశారు. విశాఖోత్సవ్‌ సందర్భంగా వారిద్దరూ సరదాగా బాక్సింగ్‌ చేశారు. అక్కడే ఉన్నవారు మంత్రుల పొలిటికల్‌ బాక్సింగ్‌ను ఆసక్తిగా చూశారు.

అంతకుముందు ప్రతిష్టాత్మక విశాఖోత్సవ్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఉడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లవర్‌షో, ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన తొమ్మిది దేవాలయాల నమూనాలను మంత్రి పరిశీలించారు. వీటిని చూసేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. మూడు రోజుల పాటు విశాఖోత్సవ్‌ జరుగుతంది. రేపటి వేడుకల్లో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.