Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 06:44AM

మెట్రో పూర్తయ్యే వరకు నిద్రపోను:ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి

  • కేంద్ర అనుమతి, జైకా రుణం తీసుకు రావటమే ధ్యేయం 
  •  భూసేకరణకు నిధులు రాబట్టడం కీలకం 
  •  కొత్త సంవత్సరంలో పిల్లర్ల నిర్మాణాలు 
  •  జపాన్ నుంచి కోచ్ లు వస్తాయి 
‘మెట్రోను పరుగులెత్తించే వరకు నిద్రపోను. ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు తీసుకు రావటం.. ‘జైకా’ రుణం సాధించటం.. భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం తక్షణ ప్రాధాన్యాలుగా ఉన్నాయి. నూతన సంవత్సరంలో బెజవాడ రోడ్లపై మెట్రో పిల్లర్లను చూస్తారు. బెజవాడ వాసుల మెట్రో కల సాకారం చేసి చూపిస్తాం.’ అని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు నూతన సంవత్సరారంభం నుంచి దశ - దిశ ఎలా ఉండబోతుందన్న దానిపై
‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్ లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
ప్ర: నిడమానూరు రైతులను ఎలా ఒప్పించారు ?
జ: అక్కడి వారు జనావాసాలు తొలగించాల్సి వస్తుందని, ఇళ్ళు పోతాయన్న అపోహలో ఉన్నారు. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహనకు అన్ని విషయాలు వివరించాను. అక్కడ ఉన్న రైతులు ఇళ్లు పోతున్నాయని చెప్పారు. మా అలైన్ మెంట్‌లో ఎక్కడా ఇళ్ళు ఉన్న ప్రాంతాన్ని నిర్ధేశించలేదని చెప్పాం. కేవలం పొలాలు మాత్రమే గుర్తించటం జరిగిందని చెప్పాం. మెట్రో కోచ డిపో అక్కడి నుంచి మార్చటం కుదరదు. ఇళ్ళు పోవటం లేదని తెలిసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు.
  
ప్ర: జైకా రుణం ఏమైంది ?
జ: జైకా రుణం రావడానికి ఇంకా చాలా స మయం ఉంది. 2017 నాటికి రావచ్చు. అప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులతో పనులు ప్రారంభిస్తాం.
  
ప్ర: భూసేకరణ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ?
జ: భూ సేకరణ అన్నది మన చేతుల్లో లేదు. రూ. 800 - 900 కోట్ల వరకు భూ సేకరణకు వ ్యయం అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పించేందుకు శక్తి వంచన లేకుండా మేం కృషి చేస్తాం. అంతా కలిపి 12 ఎకరాలు ఉండదు. ఈ స్థలాలను తీసుకోవటానికి కూడా పెద్దగా ఇబ్బందులు లేవు.
 
ప్ర: నూతన సంవత్సరంలో ప్రాధాన్యతలు ఏమిటి ?
జ: మెట్రో ప్రాజెక్టును కార్యరూపం దాల్చటానికి బోలెడంత సమయం పడుతుంది. నూతన సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర వాటాల నిధులతో పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే ఏలూరు రోడ్డు కారిడార్‌కు సంబంధించి టెండర్లు పిలిచాం. దీని పనులు కూడా ప్రారంభం అవుతాయి.
 
ప్ర: భవిష్యత ప్రణాళికలు ఏమిటి ?
జ: ముందుగా ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు తీసుకు రావాలి. ఈ లోపు భూ సేకరణ పూర్తయితే జైకా రుణం కూడా వస్తుంది. 2017, 18లో సివిల్‌ వర్క్స్‌ జరుగుతాయి. మూడున్నరేళ్ళలో ప్రాజెక్టు పూర్తి అవుతుంది. 2018లో జపాన నుంచి మెట్రో కోచలు వస్తాయి.