Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 06:33AM

యువత నైపుణ్యాభివృద్ధికి చేయూత

గుంటూరు(విద్య): యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. గుంటూరులో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు గురువారం ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవానికి హాజరైన యువతనుద్ధేశించి మంత్రి రావెల మాట్లాడారు. నూతన రాష్ట్రం నైపుణ్యాభివృద్ధిలో అగ్రస్థాయిలో ఉందని, యువత భాగస్వామ్యం అభినందనీయమని ప్రశంసించారు. యువతలోని అంతర్లీన నైపుణ్యాలు వెలికి తీయడానికే ప్రభు త్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నవ్యాంధ్ర ని ర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ ప్రతి ఒక్కరి ఎంతో కీలకమైదని, విద్యార్థిగా ఉన్నప్పుడు గీటార్‌ వాయించడంలో ప్రత్యేకత చాటుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఆయన గీటార్‌ వాయించి, డప్పుకోట్టి యువతను ఉత్సాహపరిచారు. యువతలో నిద్రాణమై ఉన్న నైపుణ్యాలకు పదును పెట్టుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర కీర్తిని పెంచాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి, మేనేజర్‌ ఎండి మెహర్‌రాజా, స్టెప్‌ సీఈవో రావి కృష్ణకపర్థి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే
ఫోక్‌ డ్యాన్స్‌: మహే్‌ష గ్రూపు(చిత్తూరు), యూన్నటీ డ్యాన్స్‌ అకాడమీ(శ్రీకాకుళం), రవికుమార్‌ గ్రూపు (విశాఖపట్టణం) మొదటి మూడు స్థానాలు గెలుచుకున్నారు.
ఫోక్‌ సాంగ్స్‌: సి.కృష్ణవేణి గ్రూపు (చిత్తూరు.), ఆర్‌ఎ సూజాత గ్రూపు కర్నూలు), కె స్టీవెన్‌పాల్‌గ్రూపు(కృష్ణా) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి
మార్షల్‌ ఆర్ట్స్‌: ఎస్‌వి ఆర్ట్స్‌ కాలేజి టీమ్‌ (చిత్తూరు), ఎస్‌ ఫరతుల్లాగ్రూపు (కర్నూలు) శికుమార్‌ టీమ్‌ (శ్రీకాకుళం) మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి.
ఒన్‌ యాక్ట్‌ ప్లే: మహేంద్ర స్కూల్‌ ఆఫ్‌ డ్రామా (భీమవరం) న్యూస్టార్‌ మోడ్రన్‌ థియోటర్‌ ఆర్ట్స్‌ (కృష్ణా), ప్రశాంతి టీమ్‌ (శ్రీకాకుళం) ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాల్లో నిలిచాయి.