Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 03:36AM

రూ. 52 కోట్లతో రాష్ట్రమంతా బస్‌స్టేషన్లు

  •  కొత్తగా 45 బస్సులు కొనుగోలు : ఆర్టీసీ ఎండీ నండూరి 
వనటౌన్, డిసెంబరు 31 : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బస్‌స్టేషన్‌లను రూ. 52 కోట్లతో అభివృద్ధి చేసి, ప్రైవేట్‌ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను నడుపుతామని, ప్రయాణికులు ఆరోగ్యం, భద్రతల నిమిత్తం ప్రతి స్టేషన్ లో మెడికల్‌ షాపులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఎండీ ఎన్‌.సాంబశివరావు అన్నారు. గురువారం పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్ (పిఎనబిఎ స్)లోని సమావేశపు కార్యాలయాంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆర్టీసీకి గత ఏడాది రూ.520 కోట్ల నష్టం వస్తే, 2015లో రూ.180 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 12 వేల బస్సులు ఉన్నాయని, వాటిలో సగానికిపైగా మరమ్మతులకు గురయ్యాయని, ప్రస్తుతం ప్రభుత్వ సహకారంతో 45 బస్సులను కొనుగోలు చేసినట్లు ఎండీ చెప్పారు.