desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 02:46AM

ఐపిఒకు దాఖలు చేసిన థైరోకేర్‌

డయగ్నోస్టిక్‌ కంపెనీ థైరోకేర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ కోసం సెబి వద్ద ముసాయిదా పేపర్లను దాఖలు చేసింది. ఐపిఒ ద్వారా కంపెనీ 1.07 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఈ ఆఫర్‌తో సుమారు పది కోట్ల డాలర్ల నిధులను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఐపిఒకు జెఎం ఫైనాన్షియల్‌, ఎడెల్‌వీస్‌, ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.