Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 02:16AM

బీఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో నెల గడువు

హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్ (బీఆర్‌ఎస్‌), లే అవుట్‌ రెగ్యులరైజేషన్(ఎల్‌ఆర్‌ఎస్‌)ల దరఖాస్తు గడువును మరో 30 రోజులు పెంచారు. జనవరి 31 వరకు ఈ అవకాశం ఉంటుంది. ఈ మేరకు మునిసిపల్‌ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి గోపాల్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నవంబర్‌ మూడో వారం నుంచి ఆనలైనలో దరఖాస్తు ఫారాలు, దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే కొన్ని చోట్ల సరైన సమాచారం లేకపోవడం, వెబ్‌సైట్‌ సరిగా పనిచేయకపోవడం కారణంగా దరఖాస్తుల సంఖ్య తగ్గింది. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పాటు... అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోవడంతో గడువును పెంచారు. కాగా, క్రమబద్థీకరణ(జీవో నెం 59)అమలుకు 2 నెలల గడువు పెంచాలని సీసీఎల్‌ఏ విన్నవించింది.