Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 02:05AM

9281 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

  • నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం
  • 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు పత్రాలు
  • దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 4
  • ఎస్‌ఐ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌
హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కొలువుకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం.. కొత్త సంవత్సరం కానుక అందించింది. పోలీ్‌సశాఖలోని ఆయా విభాగాల్లో 9281 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గురువారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అప్లికేషన్‌తోపాటు పూర్తి వివరాలు నియామకబోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. www.tslprb.inవెబ్‌సైట్‌లో అప్లికేషన్లు జనవరి 11 నుంచి ఫిబ్రవరి 4 వరకు అందుబాటులోఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 4 చివరి తేదీగా ప్రకటించారు. పరీక్ష ఫీజు మొత్తాన్ని ఏపీ ఆన్‌లైన్‌, మీ-సేవ, ఈ-సేవా కేంద్రాల్లో కట్టిన తర్వాత రశీదును ఆన్‌లైన్‌లో జతచేయాల్సి ఉంటుంది. నియామక ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు అనుసరించిన 5, 2.5 కిలోమీటర్ల పరుగును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఇవీ మార్గదర్శకాలు..
కాగా.. ప్రస్తుతం కానిస్టేబుల్‌ స్థాయిలోనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయినప్పటికీ ఎస్‌ఐ స్థాయి పోస్టుల భర్తీకి కూడా.. త్వరలో రానుంది. ఈ మేరకు మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..... పోలీసు నియామకాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సివిల్‌ కానిస్టేబుల్‌కు 18సంవత్సరాలు నిండి జూలై 1నాటికి 22 ఏళ్లు దాట కూడదు.
ఇంటర్‌ పాసై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 167.6సెం.మీ. ఛాతి 86.3సెం.మీ ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 5 సెం.మీ పెరగాలి. మహిళా కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎత్తు 152.5 సెం.మీ ఉండాలి. ఏఆర్‌ కానిస్టేబుల్‌ 18ఏళ్లు నిండి జూలై 1 నాటికి 25 లోపు ఉండాలి. పురుషుల ఎత్తు 167.6సెం.మీ., ఛాతి 86.3సెం.మీ ఉండాలి. మహిళా కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎత్తు 152.5సెం.మీ ఉండాలి. సీపీఎల్‌ కానిస్టేబుళ్లు 18ఏళ్లు నిండి జూలై 1నాటికి 22 ఏళ్లు దాటరాదు. ఇంటర్‌ పాసై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 167.6సెం.మీ. ఛాతి 86.3సెం.మీ ఉండాలి.టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు 18 ఏళ్లు నిండి ఉండాలి. జూలై 1నాటికి 22 ఏళ్లు మించరాదు. ఇంటర్‌ పాసై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 167.6సెం.మీ., ఛాతి 86.3సెం.మీ ఉండాలి.

పోలీసు విభాగాల్లో ఉద్యోగుల విభజన షురూ

పోలీసు విభాగాల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన 56 వేల మంది ఉద్యోగులలో పోలీస్‌ విభాగాలకు చెందిన సిబ్బందే 30 వేల మంది ఉన్నారు. దీంతో ఒక్క పోలీస్‌ శాఖకే.. కమలనాథన్ కమిటీ సుదీర్ఘ సమయం పట్టనుంది. ఎట్టకేలకు కమిటీ ఈ ప్రక్రియను ప్రారంభించింది. వాస్తవానికి పోలీస్‌ శాఖకు సంబంధించి కొన్ని విభాగాల్లో ఇప్పటికే తాత్కాలిక విభజన ఓ కొలిక్కి వచ్చింది. వీటిలో అదనపు డీజీపీ(ఇంటెలిజెన్స్), అదనపు డీజీపీ(సీఐడీ), ట్రాన్సపోర్ట్‌ ఆర్గనైజేషన్ విభాగాల ఉద్యోగులనుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను తెలపాల్సిందిగా ఆదేశిస్తూ ఇరు రాష్ట్రాల అధికారులు గురువారం సంయుక్తంగా ఉత్తర్వులు చేశారు. తమ ఫిర్యాదులు, అభ్యంతరాలను 14 రోజుల్లోగా ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.