Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 01:45AM

విజయవాడకు సీఎంఆర్‌ఎఫ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) విభాగాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎంఆర్‌ఎఫ్‌ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఐఏఎస్‌ అధికారి రాజమౌళి విజయవాడలోనే ఉంటున్నారు. మంత్రులు కూడా దాదాపుగా అక్కడికే సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులను పంపుతున్నారు. సిబ్బంది మాత్రం హైదరాబాద్‌లో ఉండటం ఇబ్బందికరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు.