desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 00:54AM

అగ్రి గోల్డ్‌ ఆస్తుల వేలానికి ఓకే

  • 3 సంస్థలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌
  • 0.2% కమీషన్‌ ప్రాతిపదికన వేలం
హైదరాబాద్‌ డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : అగ్రి గోల్డ్‌ ఆస్తుల వేలానికి హైకోర్టు అనుమతించింది. వేలం వేయడానికి ముందుకు వచ్చిన మూడు సంస్థలకు 0.2 శాతం కమీషన్‌ ప్రాతిపదికన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వేలం ప్రక్రియను వెంటనే ప్రారంభించి, దానిద్వారా సమకూరిన నిధులను హైకోర్టు రిజిస్ర్టార్‌ (జ్యుడీషియల్‌) పేరిట బ్యాంకు ఖాతాలో జమచేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బీ భోసాలే, జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ల బెంచ్‌ ఆదేశించింది. అంతకు ముందు అగ్రిగోల్‌ ఆస్తుల వేలం ప్రక్రియను పర్యవేక్షించడానికి హైకోర్డు నియమించిన నిపుణుల కమిటీ ... ధర్మాసనానికి నివేదికను అందజేసింది. జస్టిస్‌ సూర్యారావు నేతృత్వంలో బుధవారం ఏర్పాటయిన త్రిసభ్య కమిటీ...మెటల్‌ స్ర్కాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎ్‌సటీసీ), ఆక్షన్‌ టైగర్‌, ఏబీసీ ప్రొక్యూర్‌ సంస్థల ప్రతినిధులతో సమావేశమై విధివిధానాలు ఖరారు చేసిందని కమిటీ తరపు న్యాయవాది రవిప్రకాశ్‌ వివరించారు. వేలం ప్రక్రియ రెండు నుంచి మూడు వారాల్లో ప్రారంభిస్తాయని తెలిపారు.