Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 20:21PM

నేరం రుజువుచేస్తే ఉరికైనా సిద్ధమే : సత్యానందం

విజయవాడ : కాల్‌మనీ కేసులో తనపై మోపిన అభియోగాలు రుజువు చేస్తే ఉరికైనా సిద్ధమేనని ఏ4 నిందితుడు డీఈఈ సత్యానందం అన్నారు. నిర్దోషి అయిన తనను పోలీసులు కాల్‌మనీ కేసులో ఇరికించారని ఆరోపించారు. ముందస్తు బెయిల్‌పై అజ్ఞాతం వీడిన సత్యానందం అనంతరం కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ శాఖలో 25 సంవత్సరాల సర్వీసులో ఎటువంటి అవతవకలకు పాల్పడలేదనీ, పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే తనను కాల్‌మనీ కేసులో ఇరికించారన్నారు. చట్టం, న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థలంటే తనకు గౌరవం ఉందని, ఈ కేసు విషయంలో తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని, తాను ఎటువంటి నేరాలకు పాల్పడలేదని సత్యానందం అన్నారు. కాల్‌మనీ వ్యాపారంతోపాటు యువతులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలపై విలేకరులు సత్యానందాన్ని ప్రశ్నించిగా అవన్నీ తప్పుడు ఆరోపణలేనన్నారు.