Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 13:57PM

ఎన్టీఆర్ గ్యారేజీలో మరో మలయాళీ

వరుస విజయాలందుకున్న దర్శకుడు కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఓ పాత్ర చేస్తుండగా తాజాగా మరో మలయాళ స్టార్ భాగం కానున్నట్టు సమాచారం. ‘బెంగళూర్ డేస్’ సహా మరికొన్ని సినిమాల్లో నటించిన ఫాహద్ ఫాజిల్‌ని 'జనతా గ్యారేజీ' సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం సంప్రదించారట. ఆయన కూడా ఒకే చెప్పడంతో ఇప్పుడు ఎన్టీఆర్ గ్యారేజీలో ఇద్దరు మలయాళ స్టార్ లు భాగం అయ్యారు. కొరటాల ఇంతమందిని దింపుతున్నాడంటే ఎన్టీఆర్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశాడో అని అనుకుంటున్నారు సినీ ప్రియులు. మైతి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత ఓ హీరోయిన్‌గా ఎంపికవ్వగా రెండో హీరోయిన్ ఎవరన్నది తేలాల్సుంది.