Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 12:48PM

ఏడాదికోసారి ఇసుక రీచ్‌ల వారీగా వేలం : యనమల

విజయవాడ : 16 నెలల్లో ఇసుక ద్వారా రూ.880 కోట్ల ఆదాయం చేకూరిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఇసుకపాలసీపై కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.550గా నిర్ణయించామని... ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.
 
ఏడాదికోసారి ఇసుక రీచ్‌ల వారీగా వేలం వేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 23 జిల్లాల్లో రూ.610 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. ఇసుక ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకు, 25 శాతం రైతు సాధికారిక సంస్థకు కేటాయిస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. జనవరి 11న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.