Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 01:51AM

కాచిగూడలో ‘అదనపు’ ఆందోళన


వెంకటాద్రికి టికెట్లు జారీచేసినా కేటాయించని బోగీలు
 ప్రయాణికుల ఆందోళన

బర్కత్‌పుర/హైదరాబాద్‌ :కాచిగూడ నుంచి చిత్తూరు వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌కు రెండు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తామని టికెట్లు జారీ చేసిన అధికారులు ఆ మాట మర్చిపోయారు. టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు అధికారుల నుంచి తగిన స్పందన రాకపోవడంతో వారంతా ఆదివారం రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ నిత్యం కాచిగూడ నుంచి చిత్తూరుకు రాత్రి 8.05 గంటలకు బయలుదేరుతుంది. ఆదివారం బయలుదేరే రైలుకు అదనపు బోగీ ఏర్పాటు చేస్తామని కొద్దిరోజుల క్రితం చెప్పిన అధికారులు టికెట్లు కూడా జారీ చేశారు. అయితే ప్రయాణికులు స్టేషన్‌కు వచ్చేసరికి అదనపు బోగీ లేదు. దీంతో వారంతా ఆందోళన చేశారు. చివరికి అదనపు బోగీ ఏర్పాటు చేయకుండానే ప్రయాణికులను సర్దుబాటు చేశారు. కొంతమందిని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సర్దుబాటు చేయగా, మరికొంతమందిని అదే మార్గంలో వెళ్లే యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించారు. ఆందోళన వల్ల వెంటకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రెండు గంటల ఆలస్యంగా కాచిగూడ స్టేషన్‌ నుంచి కదిలింది.ీడ్క్థీ.ౄ్జి