Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 09:37AM

అతనో క్లిక్‌ మాస్టర్‌

పాఠశాలకు వెళ్లామా.. వచ్చామా..అని కాకుండా విద్యారంగానికి ఏదో చేయాలని బి.కొత్తకోటకు చెందిన లెక్కల మాస్టారు నూర్‌అహ్మద్‌ తపించాడు.ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉపయోగపడేలా రెండు వెబ్‌సైట్లకు రూపకల్పన చేశారు.పీటీఎం మండలం కందుకూరు జడ్పీహైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నూర్‌అహ్మద్‌ 2009లో ఉద్యోగం పొందిన నాటి నుంచే నాణ్యమైన బోధనతో గుర్తింపు పొందారు.తనకున్న కంప్యూటర్‌ పరిజ్ఞానంతో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.చిత్తూర్‌బడి.కామ్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏటీచర్‌.ఇన్‌ పేరిట వెబ్‌సైట్లను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా వీటిని తీర్చిదిద్దారు. ఇందులో టీచర్లకు సంబంధించి అన్నిరకాల జీవోలు, ఉత్తర్వులు, సీనియారిటీ జాబితా, వేకెన్సీ పొజిషన్‌, గ్రాట్యుటీ, ఇన్‌కమ్‌టాక్స్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌, పదో తరగతి స్టడీ మెటీరియల్‌, ఉపకార వేతనాల మంజూరు తదితర ఎన్నో అంశాలను సవివరంగా ఉంచారు. తమకు అవసరమైన ఎలాంటి సమాచారమైనా ఒక్క క్లిక్‌తో ఉపాధ్యాయులు ఈ వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు. దీంతో పాటు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తదితర సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఎంతో విలువైన సమాచారం అందజేస్తున్నారు.

-పెద్దతిప్పసముద్రం