Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 07:21AM

ప్రయాణికుల రద్దీతో 4 ప్రత్యేక రైళ్లు

 సికింద్రాబాద్‌ : ప్రయాణీకుల సౌకర్యార్థం తిరుపతి-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-కాకినాడటౌన్‌ మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు.

  • తిరుపతి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (02763) తిరుపతి నుంచి ఈనెల 31న రాత్రి 7.55గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుతుంది. ఈ రైలులో టిక్కెట్‌ ధర ఎప్పటి మాదిరిగా సాధారణంగానే ఉంటుంది. 
  •  తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌-తిరుపతి స్పెషల్‌ (02764) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 3న రాత్రి 8.15గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ రైలులో (టిక్కెట్‌ ధర) ప్రత్యేక చార్జీలుంటాయి. 
  •  సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ (07011) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 1న రాత్రి 9.40గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. ఈ రైలులో ప్రత్యేక చార్జీలు ఉంటాయి. 
  •  తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ ( 07012) కాకినాడ టౌన్‌ నుంచి జనవరి 2న సాయంత్రం 6గంటలకు కాకినాడ టౌన్‌ నుంచి బయల్దేరి, సాయంత్రం 4.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఈ రైలులో కూడా ప్రత్యేక చార్జీలుంటాయి.