Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 07:17AM

పొట్టి రాంబాబుకు కన్నీటి వీడ్కోలు

 కిర్లంపూడి, డిసెంబరు 30 : తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలోని బూరుగుపూడికి చెందిన హాస్యనటుడు పొట్టి రాంబాబుకు బుధవారం అభిమానులు, గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఎన్నో సినిమాల్లో హాస్యనటుడిగా నటించి హీరోగా ఎదిగిన రాంబాబు బ్రెయిన్‌స్ర్టోక్‌ రావడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతదేహాన్ని మంగళవారం రాత్రి బూరుగుపూడికి తీసుకువచ్చారు. అభిమానులు, గ్రామస్థులు రాంబాబు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ జ్యోతుల చంటిబాబు, జగ్గంపేట ఏఎంసీ డైరెక్టర్‌ ఎస్వీఎస్‌ అప్పలరాజు, ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. పులిరాజా ఐపీఎస్‌ డైరెక్టర్‌ రాఘవ మాట్లాడుతూ ప్రముఖ సినీనటులు పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌కు పొట్టి రాంబాబు అంటే ఎంతో ఇష్టమన్నారు. పులిరాజా సినిమా 30శాతం చిత్రీకరణ పూర్తయిందన్నారు. ఈ సమయంలో రాంబాబు మృతితో సినిమా బృందమంతా దిగ్ర్భాంతికి లోనైందన్నారు. జబర్దస్త్‌ టీం రచ్చరవి, రాకెట్‌ రాఘవ, అదిరే అభి, ప్రభాకర్‌ తదితరులు హైదరాబాద్‌లో రాంబాబు మృతదేహానికి నివాళులర్పించి రూ.50వేలు ఆర్థిక సహాయం చేశారన్నారు. పులిరాజా చిత్ర బృందం తరఫున రూ. లక్ష అందిస్తామన్నారు. రాంబాబు కుటుంబాన్ని సినీ పరిశ్రమ పెద్దలు ఆదుకోవాలని ఆయన కోరారు.