Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 06:51AM

అందరి సహకారంతో అనితర విజయాలు :మంత్రి పి.నారాయణ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
రాజధాని ప్రాంత రైతులు, అన్ని వర్గాల ప్రజల సహకారం, సీఆర్‌డీఏ సిబ్బంది అకుంఠితదీక్షతో ఏడాదిలోపే అమరావతి నిర్మాణంలో కీలకఘట్టాలైన రాజధాని ప్రాంత, నగర, సీడ్‌ క్యాపిటల్‌లకు సంబంధించిన బృహత ప్రణాళికల ముసాయిదాలను రూ పొందించగలిగామని సంస్థ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏ ప్రారంభమై బుధవారంతో ఏడాది పూర్తవడాన్ని పురస్కరించుకుని ఇక్కడి సంస్థ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయన కమిషనర్‌ నాగులపల్లి శ్రీకాంత, అడిషనల్‌ కమిషనర్లు రామమనోహరరావు, మల్లికార్జున, ప్రసన్న వేంకటేష్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కే వలం సంవత్సరంలోనే మాస్టర్‌ప్లాన్లను రూపొందించామన్నారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాలను సేకరిం చి, వారి మనోభావాలకు అనుగుణంగా అడుగులు వేయడంతో అవి పకడ్బందీగా రూపుదిద్దుకున్నాయని చె ప్పారు. ప్రజా రాజధాని అమరావతికి భూసమీకరణ విధానంలో 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతులను అభినందించారు. ఉదయం సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం లోనే ఉద్యోగుల సమక్షంలో నిర్వహించిన తొలి వార్షికోత్సవంలో కమిషనర్‌ శ్రీకాంత కేక్‌ కట్‌ చేశారు. ఏపీసీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం బుధవారం పలు సమావేశాలకు వేదికైంది.