Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 01:19AM

యాగాలు చేస్తే పేదల బతుకులు మారవు

  •  అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క 
దేవరుప్పుల (వరంగల్‌): రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి అశాసీ్త్రయమైన యాగాలు చేయడం సరికాదని అరుణోదయ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు. బుధవారం వరంగల్‌ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి యాగాలు చేస్తూ వ్యక్తిగతం అనుకుని కొట్టి పారేయటం సరైందికాదని, యాగాలతో ప్రజల బతుకులు మారవని అన్నారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు బాగుపడతాయని ఆశించిన కులవృత్తులు, వృత్తికళాకారులకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. ఈనెల 26న గుంటూరులో అరెస్టుచేసిన ప్రజా కళామండలి ఉమ్మడి రాష్ర్టాల ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలని విమలక్క డిమాండ్‌ చేశారు. దళితులు, కవులు, కళాకారులపై భౌతిక దాడులను తిప్పికొడతామన్నారు.