Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 01:29AM

రూ.వెయ్యి కోట్లతో వికలాంగుల ఉపప్రణాళిక ఏర్పాటు చేయాలి


రామగిరి: రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో వికలాంగుల సంక్షేమా నికి రూ.1000 కోట్లు కే టాయించి ప్రత్యేక ఉపప్రణాళిక చట్టాన్ని ఏర్పాటు చేయాలని విక లాంగుల హక్కుల జా తీయ వేదిక రాష్ట్ర ప్రధా న కార్యదర్శి టి.రాజేంద ర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఎంవీఎన్‌ విజ్ఞానకేంద్రంలో జరిగిన ఎన్‌డీఆర్‌డీ జిల్లా ప్రథమ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవో నెంబర్‌-1 ప్రకారం రాష్ట్రబడ్జెట్‌లో మూడుశాతం నిధులు కేటాయించాల్సి ఉందని, అందుక నుగుణంగా మొత్తం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించి వికలాంగుల పెన్షన్‌ రూ.1500ను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో 20లక్షలకుపైగా వికలాంగు లు ఉంటే ప్రస్తుతం రూ.3లక్షల80వేల మందికి మాత్రమే పెన్షన్లు అందుతు న్నాయని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వికలాంగులను ఐక్యం చేసి వారి హక్కుల సాధనకోసం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కృషి చేస్తుంద న్నారు. నేటి సమాజంలో కూడా మహిళా వికలాంగురాళ్లు వేధింపులకు గురవు తున్నారని ఆవేదనవ్యక్తంచేశారు. సదరన్‌ క్యాంప్‌కు వచ్చిన వికలాంగులకు మెడికల్‌ సర్టిఫికెట్లు వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అ న్ని రకాల ఉద్యోగాల్లో భర్తీ చేయుటకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల న్నారు. బస్సు, రైల్వేల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతోపాటు ఎక్కువ సీట్లను కేటా యించాలని, ఎలాంటి ష్యూరిటీ లేకుండా బ్యాంకర్లు రుణ సదుపాయం కల్పించే లా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వికలాంగులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలి వ్వాలన్నారు. వీరబోయిన వెంకన్న, వెన్న వెంకట్‌రెడ్డిల అధ్యక్షతన జరిగిన సమా వేశంలో నాయకులు సిహెచ్‌ లక్ష్మీనారాయణ, కొండమ డుగు నరసింహ, సయ్యద్‌ అఫాన్‌అలీ, ఆర్‌.వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.