Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 01:28AM

సామాజిక సేవలోనే ప్రశాంతం


- కలెక్టర్‌ చిరంజీవులు

నల్లగొండ కల్చరల్‌: ఎంత సం పాదించిందనేది ముఖ్యం కాదని, సా మాజిక సేవలోనే మానసిక ప్రశాంత త ఉంటుందని కలెక్టర్‌ టి.చిరంజీవు లు అన్నారు. ఆదివారం కొండకింది చినవెంకట్‌రెడ్డి తారకమ్మ ట్రస్ట్‌ ఆధ్వ ర్యంలో జిల్లాస్థాయి ప్రతిభ స్కాల ర్‌షిప్‌ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపికైన విద్యార్థులు ఈ స్కాల ర్‌షిప్‌లతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి నలుగురికి సహకా రం అందించాలన్నారు. ప్రతి ఒక్క రూ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ లక్ష్య సాధనకోసం నిరంతరం కృషి చేసి నప్పుడే అది సాధ్యమవుతుంద న్నారు. ఇంటర్నెట్‌ వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని, అలా కా కుండా చదువులపైనే దృష్టి సారిం చాలని కోరారు. అనంతరం 40 మం ది విద్యార్థినీ విద్యార్థులకు రూ.5వేల చొప్పున ప్రతిభ స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీ య సంవత్సరం చదువుకు నేందుకు ఈ స్కాలర్‌షిప్‌లు ఎంతో ఉపయో గపడనున్నాయని తెలిపారు. ట్రస్ట్‌ చైర్మన్‌ కొండకింది చినవెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ సీఈవో దామో దర్‌రెడ్డి, కన్వీనర్‌ పున్న అంజయ్య, డైరెక్టర్‌, విద్యార్థినీ విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు.