desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 01:28AM

సర్కారు బడుల్లో విద్యార్థులు నిల్‌...


దేవరకొండ టౌన్‌ : ప్రభుత్వం విద్యకు అధిక నిధులు కేటాయించి బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలు కంటితుడుపుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు లేక వెలవెలబోతున్నా యి. అనుభవం కల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నప్పటికీ ప్రజలు ప్రైవేటు పాఠశాలలవైపే మొగ్గు చూపుతున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉంటున్నారు. దేవరకొండ మండలంలో 87 ప్రాథమిక పాఠశాలలుండగా 20 పాఠశాలల్లో విద్యార్థులే కరువయ్యారు .దేవరకొండ పట్టణంతో పాటు మండలంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పలుచబడింది. హరిజన వాడ, ఖిల్లాబజార్‌, ముత్యాలమ్మ వీధిలోని పాఠశాల, పీటర్స్‌ పాఠశాల, బాపూజి పాఠశాల, పెద్దతండా పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. గ్రామీణ ప్రాం తంలో విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందజేస్తున్నప్పటికీ హాజర శాతం తక్కువగా వుంటుంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపంతో విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలలు మూతపడే అవకాశం ఉన్నాయి. మండలంలోని పెద్దతండాకు చెందిన పాఠశాలలో ఒకేఒక్క విద్యార్థి ఉండ డం గమనార్హం. ఇప్పటికైనా అఽధికారులు స్పందించి బడి ఈడు పిల్లల ను బడిలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చూడాలని కోరుతున్నారు. .