Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 30 2015 @ 19:50PM

ఎయిమ్స్ ఐసీయూకి.. కశ్మీర్ సీఎం ముఫ్తీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహహ్మద్ సయ్యద్‌ను ఎయిమ్స్‌లోని ఐసీయూకి తరలించారు. ఛాతిలో నొప్పి సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. బ్లడ్‌ప్లేట్‌లెట్స్ సంఖ్య తక్కువగా ఉండటంతో డాక్టర్లు వాటిని ఎక్కించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన చికిత్సను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ మంగళవారం ఎయిమ్స్‌కు వచ్చి ముఫ్తీ మహహ్మద్‌ను పరామర్శించారు. ఆయన తర్వగా కోలుకోవాలని ఆకాక్షించారు.