Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 01:28AM

నక్కలగండిని త్వరగా పూర్తిచేయాలి


పెద్దఅడిశర్లపల్లి : నక్కలగండి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్‌ బీల్యానాయక్‌ అన్నారు. అంగడిపేట ఎక్స్‌రోడ్‌ వద్ద ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్కలగండి వంకతో ఎస్‌ఎల్‌బీసీని పక్కకుబెడితే ఊరుకునేది లేదన్నారు. నక్కలగండికి సరిపడా నిధులు వెంటనే విడుదల చేసి త్వరగా పూర్తిచేసి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలన్నారు. నక్కలగండి ఎస్‌ఎల్‌బీసీకి గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీలేదంటూ ఎస్‌ఎల్‌బీసీ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుకు పనులు చేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. నక్కలగండికి నిధులు కేటాయించి ఏ ఎమ్మార్పీని పూర్తిస్థాయిలో పనులు పూర్తిచేయాలని ఆయన కోరారు. జిల్లాలో ఫ్లోరైడ్‌ బారి నుంచి ప్రజల కు శాశ్వత విముక్తి కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వడ్లపల్లి చంద్రారెడ్డి, అమ్రూనాయక్‌, ఎంపీటీసీ సభ్యుడు ఎల్లయ్య పాల్గొన్నారు.