Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 30 2015 @ 17:36PM

లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం: హరీష్‌రావు

కరీంనగర్‌: బెజ్జంకి మండలం తోటపల్లిలో మిషన్‌ కాకతీయ పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. తోటపల్లిలో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని హరీష్‌రావు కోరారు.