desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 30 2015 @ 17:29PM

ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్‌కు హైదరాబాద్ వేదిక

ఆల్ లైట్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ (ఎఎల్‌ఐఎఫ్‌ఎఫ్) మరియు ఇండివుడ్ ఫిలింమార్కెట్ వారు సంయుక్తంగా నిర్వహించబోయే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రెండో ఎడిషన్ 2016 ఆగస్ట్ 17 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు. బయ్యర్లు, ఫైట్ మాస్టర్లు సహా సినిమా రంగంలోని అన్ని విభాగాలవారూ పాల్గొంటారు. చిత్ర నిర్మాణంలోని మెళకువలు తెలుసుకోవడం, మరిందరికి స్ఫూర్తిగా నిలిచి ఉండటం ప్రధాన లక్ష్యంగా ఈ ఫిలిం ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇందులో 70 దేశాలకు చెందిన 1000 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 3000 మంది సినీ మార్కెట్ ప్రతినిధులు పాల్గొననుండగా... దాదాపు 1500 సినిమాల స్ర్కీనింగ్ జరుగనుంది.
రానున్న ఐదు సంవత్సరాలలో 10,000 మల్టీప్లెక్స్ స్క్రీన్లతో టెక్నాలజీని అప్‌డేట్ చేసేందుకు.. రూ 67,000 కోట్లు ఖర్చు అవుతుందని ఈ సందర్బంగా మాట్లాడిన ఇండివుడ్ సంస్థ అధినేత సోహన్ రాయ్ అంచనా వేశారు. సోహన్ రాయ్ నేతృత్వంలోఎన్నారై ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కింద 2,000 కంపెనీల కన్సార్టియం ద్వారా నిధులు సేకరించాలని ప్రతిపాదించారు. ఇందుకుగాను మేకిన్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుంటామన్నారు.