Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 30 2015 @ 06:34AM

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ జంబ్లింగ్‌లోనే...

గుంటూరు(విద్య): ఇంటర్‌ విద్యార్థులకు ఈ ఏడా ది జంబ్లింగ్‌ విధానంలోనే ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు ఆర్‌ఐవో వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 70 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 24వ తేదీ వరకునిర్వహించే ప్రయోగ పరీక్షలకు అన్ని మౌలిక వసతులు ఉన్న పరీక్ష కేంద్రాలను ఎంపి క చేశామని వెల్లడించారు. పరీక్షలు సజావుగా సాగేలా విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల ఆధ్వర్యం లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. పరీక్షలు ప్రారం భం అయ్యే 15 రోజులు ముందు నుంచే విద్యార్థులకు జంబ్లింగ్‌ వి ధానంలో జరిగే పరీక్షలపై అవగాహన తరగతులు నిర్వహించనునట్లు వెల్లడించారు.
పరీక్ష కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు
ప్రయోగ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఫిజిక్స్‌, కెమిసీ్ట్ర, జువాలజీ తదితర ప్రయోగ పరీక్షలకు అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటి దా కా విద్యార్థులు వారు చదివిన కళాశాల్లో ప్రయోగాలు చేసి ఉంటారని, వారికి ప్రయోగ పరీక్షలపై, పరికరాలపై అవగాహన కల్పించడం కోసం ముందస్తు చ ర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిబంధనలు ప్రకారం ప్రయోగ పరీక్షలకు ఇన్విజిలేటర్స్‌ ఎంపిక నిర్వహిస్తున్నామని తెలిపారు. జీవీపీఎస్‌ విధానం అమల్లో ఉ న్నందున ఎక్కడా అపశ్రుతులు దొర్లే అవకాశం లేదని చెప్పారు.
50 వేల మంది విద్యార్థులు
హాజరయ్యే అవకాశం

ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు ఈ ఏడాది దాదాపు 50 వేల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. నామినల్‌ రోల్స్‌ ఇంటర్‌ బోర్డు వద్ద సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తొలిసారిగా జంబ్లింగ్‌ విధానంలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణా తరగుతులు నిర్వహించినట్లు తెలిపారు.