Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 20:29PM

రాజ్ భవన్‌లో మరోసారి చంద్రుల కలయిక

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన విందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రులతో పాటు కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, దత్తాత్రేయ, ఏపీ స్పీకర్ కోడెల, తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి, ఏపీ మంత్రులు చినరాజప్ప, కామినేని, నారాయణ, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, నాయిని, హరీష్‌రావు, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీతో పాటు సీపీఐ నారయణ తదితరలు హాజరయ్యారు.