Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 10:45AM

ఖైదీల పరారీపై విచారణకు ఆదేశం

కడప : జిల్లా సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీల పరారీ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విధుల నిర్వహణలో జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై హోంమంత్రి చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీల పరారీపై విచారణకు ఆదేశించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఖైదీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.