Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 00:44AM

రైళ్ళ హాల్టింగ్‌లను కొనసాగించండి


ఎంపీ గంగరాజుకు చైర్మన్‌ శ్రీనివాస్‌ వినతి
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో రైళ్ళ హాల్టింగ్‌లను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. కొద్ది నెలల కిందట ఇచ్చిన హాల్టింగ్‌లను ఎత్తివేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఆందోళన వెలిబుచ్చారు.ఈ మేరకు నరసాపురం పార్లమెంట్‌ సభ్యుడు గోకరాజు గంగరాజుకు ఆదివారం వినతిపత్రం అందించారు. కేంద్ర స్థాయిలో రైల్వే శాఖను సంప్రదించి హాల్టింగ్‌లను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వల్ల తాడేపల్లిగూడెంతోపాటు, పరిసర ప్రాంత ప్రజల ప్రయాణానికి ఎంతో అనువుగా ఉంటుందని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా విశాఖపట్నం-నిజాముద్దీన్‌ మధ్య పయనించే స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌, హౌరా-వాస్కోడిగామా మధ్య నడిచే అమరావతి ఎక్స్‌ప్రెస్‌, హౌరా-యశ్వంత్‌పూర్‌ మధ్య రాకపోకలు సాగించే యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-సికింద్రాబాద్‌ల మధ్య పయనించే గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు, కోరమండల్‌ , నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ల హాల్టింగ్‌లను కొనసాగించాలని చైర్మన్‌ విజ్ఞప్తి చేశారు.ఆ మేరకు రైల్వే శాఖ నుంచి అనుమతులు రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. లేదం టే ప్రయాణికులు ఇబ్బంది పడతారన్నారు