Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 03:23AM

గ్లాసు నీటిలో కోటి క్రిములు

లండన్‌, డిసెంబరు 28: పరిశుభ్రమైన ఓ గ్లాసు తాగునీటిలో దాదాపు ఒక కోటి సూక్ష్మక్రిములు ఉం టాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే, ఇది మంచి బ్యాక్టీరియా అని, నీటిని మరింత స్వచ్ఛం గా మార్చి అనారోగ్యాలను దూరం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా వాటర్‌ ప్యూరిఫికేషన్‌ ప్లాంట్‌లలో కృత్రిమ యంత్రాలలో జరిగే ప్రాసె స్‌ అంతా వాటర్‌పైపులలో తిష్టవేసుకున్న ఈ బ్యాక్టీరియా చేస్తుందని అన్నారు. పరిశుభ్రమైన తాగునీటిలో ఎల్లప్పుడూ మంచి బ్యాక్టీరియా ఉంటుందని స్వీడన్‌కు చెందిన లండ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కా థెరిన్‌ పాల్‌ వివరించారు. తాగునీటి సరఫరా కోసం ఉద్దేశించిన పైప్‌లైన్‌ వ్యవస్థలో వాటర్‌ ప్యూరిఫికేషన్‌ సహజంగా జరిగిపోతుందని అన్నారు. వాటర్‌ పైప్‌లలోపల బయోఫిల్మ్‌ను పోలిన పలుచని కోటింగ్‌ రూ పంలో కనిపించే పొర ఈ తంతును జరిపిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఈ పరిశోధన స్వీడన్‌లో జరిగినా.. మిగతా ప్రపంచంలోనూ తాగునీటి సరఫర కో సం ఏర్పాటు చేసిన వ్యవస్థలో ఈ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ కాథెరిన్‌ వివరించారు.