Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 03:13AM

రాహుల్‌ యూరప్‌ పర్యటన

  • విదేశాల్లోనే నూతన సంవత్సర వేడుకలు
  • తొలిసారి ట్విట్టర్‌లో విదేశీ టూర్‌ వివరాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తన విదేశీ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచే కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా తన యూరప్‌ పర్యటన వివరాలు తెలిపారు. తను సెలవులను ఎంజాయ్‌ చేయడానికి యూరప్‌ వెళ్తున్నానంటూ రాహుల్‌ ట్విట్టర్‌ ద్వారా తెలపడం పార్టీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ‘‘కొన్ని రోజుల పాటు యూరప్‌ వెళ్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అంటూ రాహుల్‌ తన ట్విట్టర్‌ సందేశంలో తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లోనే జరుపుకునే రాహుల్‌ ఈసారి అందరికీ చెప్పి మరీ వెళ్లడమే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్‌ గాంధీ 56 రోజుల పాటు విదేశాలకు వె ళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గత బడ్జెట్‌ సమావేశాలకు కూడా హాజరు కాకుండా రాహుల్‌ విదేశాల్లో రహస్య ప్రాంతంలో గడిపి రావడాన్ని బీజేపీ విమర్శించింది.