Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 02:53AM

రాష్ట్రపతి ప్రణబ్‌తో కల్వకుంట్ల కుటుంబం

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. కేసీఆర్‌ నిర్వహించిన అయుత చండీ యాగానికి రాష్ట్రపతిని ఆహ్వానించడం.. పూర్ణాహుతి రోజు యాగశాల వరకూ వచ్చి అగ్ని ప్రమాదం కారణంగా రాష్ట్రపతి యాగంలో పాల్గొనకుండానే తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ రాష్ట్రపతిని కలిసి యాగం జరిగిన తీరును వివరించారు. కుంకుమ, ప్రసాదాన్ని రాష్ట్రపతికి అందజేశారు. కాగా యాగాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు కేసీఆర్‌కు రాష్ట్రపతి అభినందనలను తెలిపారు. కాగా ముఖ్యమంత్రి వెంట రాష్ట్రపతిని కలిసిన వారిలో కేసీఆర్‌ భార్య శోభ, మంత్రి కేటీఆర్‌ దంపతులు, కేసీఆర్‌ కూతురు, నిజామాబాద్‌ ఎంపీ కవిత దంపతులు, వారి పిల్లలు ఉన్నారు.