Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 01:37AM

సత్య నాదెళ్లకు బాబు సంప్రదాయ విందు

  • కొసరి తినిపించిన చంద్రబాబు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు ఏపీ సీఎం చంద్రబాబు సంప్రదాయ అల్పాహార విందు ఇచ్చారు. ఇడ్లీ, దోసె, వడ వంటి టిఫిన్లను వడ్డించారు. కేరళ వంటకం అప్పంను ప్రత్యేకంగా చేయించిన చంద్రబాబు దాని గురించి చెప్పి కొసరి కొసరి తినిపించారు. సత్య తండ్రి యుగంధర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇక్కడకు వస్తే చాలా హాయిగా ఉంటుందని చంద్రబాబుతో చెప్పారు. చర్చల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. బాబు మనవడు దేవాంశను సత్య నాదెళ్ల కొద్దిసేపు ఎత్తుకుని ముద్దు చేశారు.