Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 28 2015 @ 21:49PM

ఇస్లామిక్ ఉగ్రవాదులను రమాది నుంచి తరిమికొట్టిన ఇరాకీ ఆర్మీ

రమాది: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో 18 నెలలుగా ఉన్న ఉన్న రమాది నగరాన్ని ఇరాకీ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. రమాదిలోని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాజధాని బాగ్ధాద్‌కు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న రమాది నగరంలో ఐఎస్ ఉగ్రవాదులు అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేశారు. పెద్ద సంఖ్యలో క్షిపణులను, ఆయుధాలను ఇరాకీ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకూ 10 ఆయుధ తయారీ కర్మాగారాలను రమాది నగరంలో ఇరాకీ సైన్యం గుర్తించింది. ఇరాక్ సైన్యం ప్రస్తుతం రమాది నగరంలోని ప్రతి ఇంటిలో తనిఖీలు జరుపుతోంది. రమాది నగరంలో ఎక్కువ జనాభా సున్నీలే. అయితే ఇరాకీ సైన్యంలో ఎక్కువ మంది షియాలున్నారు. అమెరికా సంకీర్ణ బలగాల అండతో ఇరాకీ సైన్యం రమాది నగరాన్ని స్వాధీనం చేసుకుంది. ఇరాకీ సైన్యం తదుపరి టార్గెట్ మోసుల్ నగరం.