Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 00:30AM

గీతసొసైటీ పేరుతో ఒకే కుటుంబం లబ్ధి


అక్రమంగా కల్తీ కల్లు సరఫరా
పట్టించుకోని ఎక్సైజ్‌ శాఖ
నిజమైన గౌడ్‌లకు అన్యాయం
అర్హులను గుర్తించి న్యాయం చేయాలి
జిల్లా గౌడ సంఘం నాయకులు

అనంతగిరి : సొసైటీల పేరుతో అక్రమంగా కల్తీకల్లు రవాణ చేస్తున్నారని జిల్లా గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్‌ ఆరోపించారు. ఆదివారం స్థానిక క్లబ్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్లు గీత సొసైటీ పేరుతో ఒకే కుటుంబం లబ్ధిపొందుతుందన్నారు. ఆలంపల్లిలో ఏర్పాటు చేసిన సొసైటీ ఆలంపల్లిలోనే కల్లు సరఫరా చేయకుండా అక్రమంగా వివిధ మండలాలలకు కల్తీ కల్లు సరఫరా చేసి నిజమైన గౌడ్‌లకు అన్యాయం చేస్తూ అటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. వికారాబాద్‌ పరిధిలో సుమారు 300 కుటుంబాలు ఉంటే అందులో ఎవ్వరికి ఈ సొసైటీ వల్ల లబ్ధిచేకూరడం లేదన్నారు. పక్క జిల్లా నుంచి వచ్చిన భానుగౌడ్‌ అనే వ్యక్తికి సొసైటీని కట్టబెట్టారని ఆరోపించారు. ఈ సొసైటీ ద్వారా వివిధ గ్రామాల్లో సుమారు 17 అక్రమ కల్లు దుకాణాలు నడుస్తున్నాయన్నారు. ఈ దుకాణాల్లో కల్తీ కల్లు తాగి ఇటీవల చాలా మంది ఆసుపత్రుల పాలవడం, మృత్యువాత పడ్డారన్నారు. అధికారులకు మామూళ్లు ముట్టచెప్పి ఈ తతంగం నడిపిస్తూ గీత కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. టీసీఎస్‌లో కనీసం స్థానికంగా ఉన్న కుటుంబాలకు సంబంధించి సభ్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఒకే కుటుంబానికి చెందిన వారు సభ్యులుగా ఉండి సొసైటీ ఏర్పాటు చేశారని తద్వారా చాలా కాలంగా వికారాబాద్‌లో వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారి నోట్లో మట్టి పడుతుందన్నారు. స్థానికంగా ఉన్న అర్హులను ప్రభుత్వం గుర్తించి వెంటనే వారికి ప్రాధాన్యత ఇచ్చి సొసైటీలో భాగస్వాములను చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లికార్జున్‌గౌడ్‌, సురేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.