Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 28 2015 @ 10:41AM

వరంగల్ జిల్లాలో దారుణం... ఇద్దరు విద్యార్థినుల దారుణ హత్య

  • ఖాదర్‌పేటలో అమానవీయ సంఘటన
  • శునకం తెచ్చిన చేతిభాగంతో గుర్తింపు
  • పిల్లలది హత్యా అంటున్న తల్లిదండ్రులు..
చెన్నారావుపేట : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లె ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు దారుణ హత్యకు గురైన అమానవీయమైన సంఘటన చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గ్రామ శివారు గుట్టల ప్రాంతంలో ఆదివారం వెలుగు చూసింది. మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... పర్వతగిరి మండలం నారాయణ తండాకు చెందిన బానోతు యాకమ్మ-కిషనల కూతురు భూమిక(14), బానోతు కమలమ్మ-బాలుల కూతురు ప్రియాంక(14) నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లె ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. పాఠశాల నుంచి వీరు దీపావళి పండుగ కోసం స్వ గ్రామానికి వెళ్లారు. అనంతరం 24న పాఠశాలకు బయలుదేరిన బాలికలు మార్గమధ్యలో ఆశ్రమంలో పనిచేసే ఓ వర్కర్‌కు ఫోన చేయగా ఆమె వారిని తిట్టినట్లు తెలిసింది. దీంతో వారు పాఠశాలకు రాకుండా ఎటో వెళ్లిపోయారు. అయితే 27వ తేదీ వరకు విద్యార్థినులు రాలేదని పాఠశాల నుంచి తల్లిదండ్రులకు ఫోన ద్వారా సమాచారం అందజేశారు. వెంటనే తల్లిదండ్రులు తమ పిల్ల లు కనిపించడం లేదని పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పిల్లల ఆచూకీ కోసం తల్లిదండ్రులు వెతుకుతున్నారు.
 
కుక్క తెచ్చిన చేతిభాగంతో వెలుగులోకి...
ఖాదర్‌పేటలో ఆదివారం ఉదయం ఓ కుక్క మృతదేహానికి చెందిన చేతిభాగాన్ని నోట్లో పట్టుకొని గ్రామంలోకి వచ్చింది. దీన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గుట్టపె ౖన ఉన్న కుక్కలను చూసి ఆప్రదేశానికి వెళ్లగా చెల్లాచెదురుగా పడి కుళ్లిపోయి న రెండు మృతదేహాలు కనిపించాయి. పాఠశాల దుస్తుల ఆధారంగా అదృశ్యమైన విద్యార్థులుగా భావించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా గుర్తించారు.
 
నిందితులను కఠినంగా శిక్షించాలి...
తమ పిల్లలను ఆశమ్ర పాఠశాలలో పనిచేస్తున్న హాస్టల్‌ వర్కర్‌ రాజమ్మ, సస్పెండ్‌ అయిన ఉపాధ్యాయుడు అనిల్‌తో పాటు సమీప బంధువులు కలిసే హత్య చేశారని బాలికల తల్లిదండ్రులు ఆరోపించారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భోరుమన్నారు. ఘటనా స్థలాన్ని రూరల్‌ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా, మామునూరు సీఐ సురేష్‌, గూడూరు సీఐ వెంకటేశ్వర్‌, ఇనచార్జి ఎస్సై వెంకటేశ్వర్లు మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇనచార్జి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
 
చిన్నాభిన్నమైన మృతుల శరీర భాగాలు...
గుట్ట ప్రాంతంలో వెలుగు చూసిన బాలికల మృతదేహాలు చిన్నాభిన్నంగా మారాయి. కొద్దిరోజుల క్రితం చనిపోయిన బాలికల మృతదేహాల అవయవాలను నక్కలు, కుక్కలు దూరంగా వేయడంతో శవాలు ఏర్పడని స్థితిలో ఉన్నా యి. అక్కడ ఉన్న స్కూల్‌ యూనిఫాం, చెప్పులు, పట్టీల ఆధారంగా శవాలను గుర్తించారు. సంఘటన స్థలంలో పురుగులమందు డబ్బాతో పాటు సమీప బంధువుల ఫొటోలు, నర్సంపేటలోని ఓ థియేటర్‌కు చెందిన టికెట్లు లభించాయి.
 
మిస్టరీగా మారిన ఇద్దరు బాలికల మృతి...
ఖాదర్‌పేట గుట్టలో వెలుగు చూసిన ఇద్దరు బాలికలమృతి సంఘటన మిస్టరీగా మారింది. ఇది హత్యా? ఆత్మహత్యా?అనే మీమాంసలో అధికారులు, పోలీ సులు పడిపోయారు. నెల రోజుల క్రితం అదృశ్యమైన బాలికలు వారికి తెలియ ని ప్రాంతమైన ఖాదర్‌పేట గుట్ట వరకు ఎలా వచ్చారనే విషయం ప్రశ్నార్థంగా మారింది. వారిని ఎవరైనా ఇక్కడకు తీసుకువచ్చి హత్యకు పాల్పడి ఉండవచ్చనేది గ్రామస్థులు, కుటుంబసభ్యులు అభిప్రాయ పడుతున్నారు. సంఘటన స్థలంలో పురుగుల మందు డబ్బా కనిపించడం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్ర యత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు విద్యార్థులను ఎవరైన కిడ్నాప్‌ చేసి బంధించి వదిలిపెడితే తమ బండారం బయటపడుతుందనే అనుమానంతో హత్య చేసి గుట్టలో పడేసి ఉండవచ్చిన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
స్పెషల్‌ టీంతో దర్యాప్తు చేపడుతాం : ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా
బాలికల మృతిపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షిస్తామని రూరల్‌ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా అన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ మృతుల కుటుంబాలతో దర్యాప్తునకు సహకరించాలని కోరారు.