Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 04:15AM

జడ్పీ సీఈవోకు హైకోర్టు అక్షింతలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా పరిషత్‌ సీఈవోకు హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రభుత్వం ఒకసారి సర్వేచేసి అది ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలమని ప్రకటించినప్పటికీ మొండిగా స్వాధీనం చేసుకుని ప్రహరీగోడ నిర్మించడాన్ని తప్పు పట్టింది. ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చర్యలకు పాల్పడిన సీఈవోకు రూ. 15వేలు జరిమానా విధిస్తూ ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా పిటిషనర్లకు చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్టి జస్టిస్‌ ఎం.ఎస్‌. రామచంద్రరావు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. వివరాల్లోకి వెళితే... ఖమ్మం (అర్బన్‌) మండలంలోని ఖానాపూరం హవేలి గ్రామ సర్వే నెంబర్‌ 237/3లోని 700 చదరపు గజాల స్థలాన్ని డాక్టర్‌ నాగేశ్వరరావు, డాక్టర్‌ శ్రీదేవి దంపతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి కొలుగోలు చేశారు. ఈ స్థలం సమీపంలోని స ర్వే నెం.236, 237లలోని సుమారు 3.39 ఎకరాల భూమిని జిల్లా పరిషత్‌ అవసరాలకోసం ప్రభుత్వం సేకరించింది. అయితే డాక్టర్‌ నాగేశ్వరరావుకు స్థలాన్ని విక్రయించిన వారు జిల్లా పరిషత్‌కు చెందిన స్థలాన్ని ఆ క్రమించి విక్రయించారని అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై స ర్వే చేసిన రెవెన్యూ అధికారులు ఆ స్థలం జిల్లాపరిషత్‌ అవసరాలకు సేకరించిన భూమిలో లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ దురుద్దేశపూర్వకంగా జిల్లా పరిషత్‌ సీఈవో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటూ గతసంవత్సరం ప్రహరీ గోడ నిర్మించారు. దీంతో డాక్టర్‌ నాగేశ్వరరావు దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హై కోర్టు ఒక సారి రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఆ స్థలం ప్రభుత్వానిది కాదని తేల్చిన తర్వాత మళ్లీ జిల్లా పరిషత్‌ సీఈవో ఆ స్థలాన్ని స్వాఽ దీనం చేసుకోడాన్ని తప్పు పట్టింది. దురుద్దేశపూర్వకంగా ప్రైవేటు వ్య క్తుల స్థలాన్ని స్వాధీనం చేసుకుని వారిని అవస్థల పాలు చేసిన జడ్పీ సీఈవోకు రూ.15వేలు జరిమానా విధిస్తూ ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది.